భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తా…

బి ఎన్ ఆర్ కే ఎస్ టౌన్ అధ్యక్షులుగా గంధమల్ల కిష్టయ్య ఏకగ్రీవ ఎన్నిక
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట
బచ్చన్నపేట భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం టౌన్ అధ్యక్షులుగా గంధమాల కిష్టయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షులుగా రాగిరి సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శిగా గంధమల్ల నరేష్,సహాయ కార్యదర్శిగా ఇరుగు మహేందర్, కోశాధికారిగా కుక్కుడాల పాండురంగం,ఆర్గనైజర్ గా గుడ్ల మనోహర్,లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, టౌన్ అధ్యక్షులు గంధమల్ల కిష్టయ్య మాట్లాడుతూ భవన కార్మికులకు ఎ లాంటి సమస్యలు వచ్చిన తమ ముందుండి పరిష్కరిస్తానని వెల్ఫేర్ బోర్డును ప్రవేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అమలుపరచాలని 50 సంవత్సరాలు నిండిన కార్మికుడికి 5000 పెన్షన్ ఇవ్వాలని కార్మికుల బ్రతుకున్నంత వరకు కార్డును కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దు నాగయ్య,అల్వాల ఎల్లయ్య, కుకుడాల పుల్లయ్య,అల్వాల నాగరాజు, రాగిర్ మురళి,గంధమాల జంపయ్య, టేకులపల్లి సంపత్, కర్రె రవికుమార్ సిద్ధులు,కేశయ్య,కిషన్, జంధ్యాల ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.

