Sunday, March 1, 2026

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత 

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత 

నిరుపేదలకు అండగా నిలుస్తున్న సామాజికవేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతుల రాములు యాదవ్ 

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ పోతుల రాములు యాదవ్ అండగా నిలుస్తున్నారు. జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం , పోచన్నపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన గద్ద రాజమ్మ,నర్సింగా లచ్చమ్మ కుటుంబ సభ్యులను సామాజికవేత్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతుల రాములు యాదవ్ పరామర్శించి నేనున్నానని మనోధైర్యాన్ని ఆ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూపాయలు5000 ఆర్థిక సహాయంగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తానని ఏ ఆపద వచ్చిన తనను సంప్రదించాలని కోరారు. ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అడగకుండానే ఆర్థిక సాయం అందించిన పోతుల రాములు యాదవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు . ప్రజలకు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్న పోతుల రాములు యాదవ్ ను గ్రామస్తులు అభినందించారు.నర్సింగ్ ఎల్లేష్, బుడుగె రామచంద్రం, శ్రీపతి అనిల్, మామిడి ఐలయ్య, వస్పరి నర్సింలు ,కొక్కలకొండ లింగయ్య , మంత్రి సిద్ధులు ,దొమ్మా ట వెంకటేశం ,బాల్ నరసయ్య, తదితరులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular