అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం..

జనగామ జిల్లా మాజీ రైతు బందు సమితి అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి
మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరికొంతమంది ఎమ్మెల్యేలు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులను అక్రమ అరెస్టుకు నిరసనగా జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బచ్చన్నపేట మండల కేంద్రంలో జనగామ జిల్లా మాజీ రైతు బందు సమితి అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపుతున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి వెంటనే విడుదల చేయవలసిందిగా కోరుతున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట మాజీ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, బచ్చన్నపేట పట్టణ అధ్యక్షులు గంధమల్ల నరేందర్, మాజీ కో ఆప్షన్ షబ్బీర్, నాయకులు బోడిగం గోవర్ధన్ రెడ్డి, గర్నపల్లి మల్లయ్య, మీస శ్రీనివాస్, యాదగిరి, మల్లేశం తదితరులు పాల్గొనడం జరిగింది.

