ముత్తిరెడ్డి కాలనీలో అక్రమంగా తీసుకున్న ప్లాట్లు తిరిగిచ్చేయాలి
ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి వారిని సస్పెండ్ చేపిస్తా…

బిఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ ఎండి ఫిరోజ్
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
ముత్తిరెడ్డి కాలనీలో అక్రమంగా ప్లాట్లు తీసుకున్న వారు తిరిగి ఇచ్చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ ఎండి ఫిరోజ్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ జిల్లా, బచ్చన్నపేట మండల కేంద్రంలో జనగామ రోడ్డుకు ఉన్న ముత్తిరెడ్డి కాలనీలో బిఆర్ఎస్ పార్టీ చెప్పుకుని సామాన్యుల వద్ద నుండి అక్రమంగా రెండు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇద్దరు బడా నాయకులు ఆ ప్లాట్లను తిరిగి వారికి అప్పగించాలని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ చెప్పుకుని అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దృష్టికి ఈ బడా నాయకుల గురించి తీసుకువెళ్లి పక్క ఆధారాలతో వారికి చూపించి వారిని నుండి సస్పెండ్ చేపించే వరకు ఊరుకునేది లేదని అన్నారు. ఆ బడా నాయకుల వల్లనే బచ్చన్నపేట మండలంలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. వారి అక్రమాల చిట్టా ఆధారాలతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి వారిని సస్పెండ్ చేపిస్తామని అన్నారు.

