మాజీ ఎంపీపీ కి పరామర్శ

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచన్నపేట మండల మాజీ ఎంపీపీ అరుగొండ పర్శరాములు సతీమణి ఆరుగొండ జ్యోతి మృతి చెందడంతో జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి చరవాణిలో మాట్లాడి ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేత వెంకన్న ,సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ లు మాజీఎంపీపీ అరుగొండ పర్శరాములు సతీమణి ఆరుగొండ జ్యోతి పార్ధవ దేహానికి పూలమాలవేసినివాళులర్పించారు. వారిని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జ్ క్రాంతి, జ్యోతి భాస్కర్, దాచేపల్లి నర్సింగరావు ,గుర్రపు బాలరాజు, దేవరకొండ రమేష్, యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్ తదితరులు పాల్గొన్నారు.

