బచ్చన్నపేట లో ఓపెన్ హోటల్ (తిన్నంత భోజనం) ప్రారంభం

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎదురుగా దుర్గమ్మ గుడి వద్ద ఓపెన్ హోటల్ (అతి తక్కువ రేటుకు తిన్నంత భోజనం) ను కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయంకృషితో ఎదగాలని, జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ప్రతి ఒక్కరు ఎదో ఒక పని చేయాలన్నారు. ఉద్యోగం రాలేదని, ఏ పని చేయలేనంటూ ఖాళీగా కూర్చోకుండా స్వయం శక్తితో ఎదగాలని సూచించారు.ఈ సందర్భంగా చిన్నరామచర్ల గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మ కరుణాకర్ రెడ్డి, కళ్లెం రమేష్,శ్రీపతి యాదగిరి ప్రశాంత్,సందెల రాములు, జర్నలిస్టులు శ్రీనివాస్ రెడ్డి హరికుమార్ ,మల్లేశం ,వనమైన వెంకటేష్ గౌడ్, బాల్ నరసయ్య ,భాస్కర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

