బాబోయ్ కుక్కలు!
వీధుల్లో పగలు రాత్రి కుక్కలతో భయం భయం
గోపాల్ నగర్ లో ఇద్దరిపై దాడి

మన సాక్షి గొంతుక డెస్క్
బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. బచ్చన్నపేట, గోపాల్ నగర్ తదితర గ్రామాల్లో వీటి ప్రభావం అధికంగా ఉంది. ప్రధాన రహదారులతో పాటు వీధుల్లోను గుంపులు గుంపులుగా సంచరిస్తూ చిన్నారులు, వృద్ధులు అని తేడా లేకుండా దాడులు చేస్తున్నాయి. రేయింబవళ్లు రోడ్ల వెంట సంచరిస్తుండడంతో పనులపై బయటకు వెళ్లాలన్నా, తిరిగి నివాసాలకు చేరుకోవాలన్నా ప్రజలు భయాందోళనలతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు. గోపాల్ నగర్ గ్రామంలో ఇద్దరు పై పిచ్చి కుక్క దాడి చేసింది. ఇప్పటికైనా కుక్కలను నియంత్రించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రభుత్వం కృషి చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.

