Sunday, March 1, 2026

సర్పంచ్లను మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీఏ…

సర్పంచ్లను మోసం చేసింది బిఆర్ఎస్ పార్టీఏ…

చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లోనే..

జనగామ మహిళ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు పిన్నింటి కావ్య రెడ్డి

మన సాక్షి గొంతుక /జనగామ/ బచ్చన్నపేట మండలం

తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లను మోసం చేసి వారి ఆత్మహత్యలకు కారణమైంది గత బిఆర్ఎస్ ప్రభుత్వమే అని జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు పిన్నింటి కావ్య రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని వారి కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా చేసుకున్నారని అన్నారు. సర్పంచులకు బిల్లులు ఇస్తామని చెప్పి వారితో పని చేయించి వారికి బిల్లులు ఎగ్గొట్టి ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పి వారికి నిధులు ఇవ్వక వారి ఆత్మహత్యలకు కారణమైంది కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో గత ఎన్నికల్లో చెప్పిన విధంగా సంవత్సరంలోపే 6 గ్యారంటీలు అమలు చేసి ఇది ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం నిరూపించుకుందని అన్నారు. రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలుస్తుంది అని అన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేర్యాల ప్రజల ఓట్లను దండుకొని వారిని మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తుందని అది కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారితోనే సాధ్యమని అన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు కూడా చెల్లించేది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వమే అని గౌరవ మంత్రివర్యులు సీతక్క చెప్పడం జరిగిందని అన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular