Monday, March 2, 2026

లక్షల, కోట్లు సార్లు అయినా డా.అంబేద్కర్‌ పేరు తలుస్తునే ఉంటాం…

లక్షల, కోట్లు సార్లు అయినా డా.అంబేద్కర్‌ పేరు తలుస్తునే ఉంటాం…

అమిత్ షా వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం

అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలి

బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి

మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం

బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ,నెహ్రూలను విమర్శిస్తు , ఇప్పుడు అంబేద్కర్‌గారివెంటబడ్డారు,అమిత్‌షాపై చర్యలు తీసుకునేంతవరకూ కాంగ్రెస్‌ పోరాడుతూనే ఉంటుందని. హెచ్చరించారు. “జాతి సమానత్వం,రాజ్యాంగ గౌరవమే మా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం” అని భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌.అంబేద్కరే మాకు ప్రజలందరికీ దేవుడు అని,అమిత్ షా వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని,అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగంగా బీజేపీ వ్యాఖ్యలు ఉన్నాయని,మనుస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోందని అన్నారు,రాజ్యాంగ నిర్మాతను ప్రతి సారి హేళన చేస్తోందని,మన రాజ్యాంగం మీద, బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితం అయ్యిందని,మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలని,బడుగు బలహీన వర్గాల కోసం తపించే కాంగ్రెస్‌ లక్షల, కోట్లు సార్లు అయినా డా.అంబేద్కర్‌ పేరు తలుస్తునే ఉంటుందని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఇప్పటికే బీజేపీపై పోరాడుతున్న కాంగ్రెస్‌, ఇప్పుడు అంబేద్కర్‌కు జరిగిన అవమానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular