దైవభక్తితో గుడికి మైక్ సెట్ అందజేత

చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ నల్లనాగుల శ్వేత వెంకన్న
మన సాక్షి గొంతుక /చేర్యాల/ కొమురవెల్లి
చేర్యాల మండలం, నాగపురి గ్రామ శివారులో ప్రసిద్ధ కొండపోచమ్మ ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ శ్రీ నల్ల పోచమ్మ ఆలయానికి చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ నల్లనాగుల శ్వేత వెంకన్న గార్లు మైక్ సెట్ ను ఆలయ చైర్మన్ గూడపు మహేష్ గారి సమక్షంలో వితరణ చేయడం జరిగింది.. సందర్భంగా వారు మాట్లాడుతూ దైవభక్తితో గుడికి మైక్ సెట్ అందజేసిన చైర్మన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం శాలువాలతో సన్మానించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చేర్యాల మండల అధ్యక్షులు కొమ్మురవి ,పిఎసిఎస్ చైర్మన్ మెరుగు కృష్ణ ,కౌన్సిలర్ తారా యాదగిరి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ కృష్ణన్, బందిగా AMC డైరెక్ట్ భైరగోని భాను, జనగామ నియోజవర్గం అధ్యక్షులు కర్క సంతోష్ రెడ్డి చేవెళ్ల రాజన్న వజ్రోజు శంకరాచారి చేర్యాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భూమని బాలరాజు తదితరులు పాల్గొన్నారు

