బీసీ సెల్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో గుర్రపు బాలరాజు కు సన్మానం
గుర్రపు బాలరాజును సన్మానించిన బిసి సెల్ అధ్యక్షుడు
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి జాయింట్ సెక్రటరీ గుర్రపు బాలరాజు ని బచ్చన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు దాచేపల్లి నర్సింగరావు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనకు ఇంకా ఎన్నెన్నో పదవులు రావాలని ఆ దేవుని కోరుకున్నట్టుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు మరియు మాజీ ఎంపీటీసీ అల్వాల రాధా ఎల్లయ్య, సందెల రాములు ,దేవరకొండ రమేష్ ,సూత్రమైన రామకృష్ణ, మాజీ ఉపసర్పంచ్ కొండా హరికృష్ణ వేముల బద్రీనాథ్, పందిపెళ్లి నర్సిరెడ్డి, కురాకుల రవి, సంధి నర్సిరెడ్డి ,సమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.


