Monday, March 2, 2026

జనగామ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే

జనగామ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే

జనగామ ఎమ్మెల్యే దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 

మాజీ సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి 

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

ప్రజా నాయకుడు ,జనగామ నియోజకవర్గ ప్రజల ఆపద్బాంధవుడు జనగామ ఎమ్మెల్యే పల్లా నీలిమా రాజేశ్వర్ రెడ్డి దంపతులకు బచ్చన్నపేట మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి రైతుల ప్రక్షాళన నిలబడి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కీలకపాత్ర ను పల్లా రాజేశ్వర్ రెడ్డి పోషించారని అన్నారు. ఇప్పుడు జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకున్నా ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీతో పోటీపడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. జనగామ నియోజకవర్గం ప్రజలకు వారి సొంత ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందించి ఆర్థికంగా ఆదుకుంటున్నారని అన్నారు.వారి నాయకత్వంలో జనగాం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా మరోసారి జనగామ ఎమ్మెల్యే పల్ల నీలిమ రాజేశ్వర్ రెడ్డి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular