పల్లా దంపతులకు శివుడి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు


మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ ఎమ్మెల్యే పల్లా నీలిమ రాజేశ్వర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా బచ్చన్నపేట మండలం, నారాయణపురం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి దంపతులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యే పల్లా నీలిమ రాజేశ్వర్ రెడ్డి లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ , ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఆపద అంటే ఆదుకునే మనసత్వం గల ఎమ్మెల్యే పల్లా దంపతులు అన్నారు.నియోజకవర్గ ప్రజలకు ఎన్ని లక్షల ఆపరేషన్ లైన ఉచితంగా ఆసుపత్రిలో చికిత్స ను అందిస్తూన్న ఎమ్మెల్యే పల్లా దంపతులకు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు కూడా ఉంటాయని అన్నారు.

