ఖమ్మం కమ్మ మహాజన సంఘంలో లుకలుకలు!

మన సాక్షి గొంతుక/ ఖమ్మం
శుభమా అని ఫంక్షన్ చేసుకోవాలని ఫంక్షన్ హాలు బుక్ చేసుకొని డెకరేషన్ కొరకు శరత్ డెకరేట్స్ వారితో ఒప్పందం చేసుకొంటే.. సంఘ నాయకుడైన రావూరి సైదుబాబు తోనే డెకరేషన్ చేయించుకోవాలని లేదంటే నిన్ను ఫంక్షన్ చేసుకోనివ్వం అని స్వయానా అధ్యక్షుడు ఎర్నేని రామారావు యే హుకుం జారీచేస్తున్న వైనం.. దానికి వంత పలికే కార్యదర్శి గొడవర్తి నాగేశ్వరరావు. ఈ మొత్తం వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారి కులం పరువు పోకూడదని ఈ వ్యవహారంలో కుల సంఘం పెద్దలైన ఏలూరి శ్రీనివాసరావు , మందటి నరేష్ చౌదరి, సామినేని హరిప్రసాద్, కర్నాటి వీరభద్రం, నున్నా నవీన్, నూతలపాటి నాగేశ్వరరావు తదితరులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పి సామరస్యంగా పరిష్కరించి సంఘ బాధ్యులు సంఘం భవనం లో వ్యాపారం చేయకూడదని మందలించి ఇక ముందు ఇలా ఏక పక్షంగా వ్యవహరిస్తే సభ్యులందరినీ పిలిచి తగు చర్యలు తీసుకోవలసి వస్తుందని సమావేశాన్ని సామరస్యంగా ముగించారు.

