ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం
రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి అన్నారు. ఓ ప్రకటన ద్వారా వారు మాట్లాడుతూ ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారన్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఎర్రోళ్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదని.. అరెస్టులు అంత కన్నా కాదన్నారు. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి బెదిరింపు చర్యలకు భయపడే వారెవరూ లేరని అన్నారు.

