Sunday, March 1, 2026

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు

ఆయన మరణం దేశానికి తీరని లోటు….

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణించడం కాంగ్రెస్ పార్టీకి, దేశానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, చౌరస్తా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి మన్మోహన్ సింగ్ అమరహే అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లపాటు దేశ ప్రధానిగా గొప్ప సేవలందించారని ప్రశంసించారు. ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు.రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం చైర్మన్గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్గా ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ గొప్ప మేధావి అని కొనియాడారు. ఆయన కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఏ బాధ్యత నిర్వహించినాం ప్రతి చోటా తనదైన ముద్ర కనబరిచారని గుర్తు చేశారు. ఆయన దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్, ఆముదల మల్లారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, మహాత్మ చారి, బాలకిషన్, ఎండి మసూద్, దాచేపల్లి నర్సింగరావు, జ్యోతి భాస్కర్, గుర్రపు బాలరాజు, అంబాల ఆగయ్యగౌడ్, సందెలరాములు, వేముల వెంకట్, పిన్నింటి బాపురెడ్డి, రామకృష్ణ, దాచేపల్లి రాజయ్య, దేవరకొండ రమేష్, బుచ్చిరాజు, అవధూత శ్రీనివాస్, అల్వాల రమేష్ , గంధమల కిష్టయ్య, గంగరబోయిన మహేందర్, చింతల కర్ణాకర్, అఖిల్ మాల ,అభి, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular