తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నియామకం
బచ్చన్నపేట మండలఅధ్యక్షునిగా ఆరేళ్ల భాస్కర్..

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక గారి ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండల కేంద్రంలో బచ్చన్నపేట మండలం అధ్యక్షునిగా ఆరేళ్ల భాస్కర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రం అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ రాష్ట్ర మన రజకుల హక్కుల పోరాటానికి ఈనెల 29 అనగా ఆదివారం రోజున జనగామ జిల్లా కేంద్రంలో తలపెట్టిన మహాసభకు బచ్చన్నపేట మండలం తరపున అందరు రజకులు ఏకతాటిపై తరలిరావాలని కోరారు. మండల అధ్యక్షునిగా ఎన్నికైన ఆరేల్ల భాస్కర్ మాట్లాడుతూ రజకుల హక్కుల కోసం నిరంతరం పాటుపడతానని పేర్కొన్నారు. అలాగే రజకుల హక్కుల సాధన కోసం బచ్చన్నపేట మండలం వివిధ గ్రామాలలో ఉన్న రజకులు ఇట్టి మహాసభకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మిన్నలాపురం జలంధర్, జిల్లా సలహాదారు మడలిపాటి రమేష్, జిల్లా జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ మల్లేశం, రజక సంఘం నాయకులు పోచంపల్లి నాగరాజు శివకుమార్, మిన్నలాపురం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

