కొమ్మూరి ప్రతాపరెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా
బెజవాడ కనకదుర్గమ్మ కు ప్రత్యేక పూజలు

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బొట్టు గణపతి విజయవాడ కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ఆదేశాల మేరకు యువ నాయకుడు బొట్టు గణపతి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని కొమ్మూరి ప్రతాపరెడ్డి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గమ్మ ఆశీస్సులు ప్రతాపరెడ్డికి ఉండాలని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమ్మురి ప్రతాప్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి నాయకత్వంలో జనగామ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని, విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు కొమ్మూరి ప్రతాపరెడ్డికి ఉండాలనీ మొక్కులు చెల్లించాలని తెలియజేశారు.

