చైర్మన్ ఆత్మహత్యయత్నం అంటూ వచ్చిన వార్త ఆవాస్తవం
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
చేర్యాల మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేత ఆత్మహత్యాయత్నం చేశారంటూ వచ్చిన వార్త ఆవాస్తవమని ఆమె భర్త నల్ల నాగుల వెంకన్న వీడియోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ అయితే ఆత్మహత్యయత్నం జరిగిందని కొందరు గిట్టని వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని, ఈరోజు కొన్ని మీడియాలలో వచ్చిన వార్త పూర్తిగా ఆ వాస్తవమని అన్నారు. రాజకీయ సమస్యలు, ఆర్థిక సమస్యలు ,ఎలాంటివిలేవు కావాలనే దుష్ప్రచారం జరుగుతుందని ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మవద్దని ఖండించారు. ప్రస్తుతం మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేత ఆరోగ్యం మంచిగానే ఉందని తెలియజేశారు.

