ఎంపీ ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలి

కాంగ్రెస్ యువజన సంఘం మండల అధ్యక్షులు ఎద్దు హరీష్
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి నాయకుడు రమేష్ బిధుడి వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ యువజన సంఘం మండల అధ్యక్షులు ఎద్దు హరీష్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నియోజక వర్గంలోని అన్ని రహదారులను ప్రియాంక గాంధీ బుగ్గల తీర్చిదిద్దుతామని బిజెపి నేత వ్యాఖ్యానించడం బాధాకరమని అన్నారు. రమేష్ బీదుడి చేసిన వాక్యాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి నాయకులకు మహిళలను కించపరచడం అలవాటుగా మారిందని అన్నారు. రమేష్ బీధుడి చేసిన వాక్యాలను ఖండిస్తున్నానని అన్నారు. బిజెపి నేత చేసిన వాక్యాలను వెనుకకు తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.

