Sunday, March 1, 2026

ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

మన సాక్షి గొంతుక న్యూస్/జనగామ రూరల్ :

భారతదేశ ఖ్యాతి ని,సంస్కృతిని సాంప్రదాయాలను ఖండాంతరాలు దాటించిన యోగి వివేకానంద 162 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.బీజేపీ జనగామ మండల అధ్యక్షులు లద్దునూరి మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి 162 వ జయంతి కార్యక్రమన్ని పురస్కరించుకొని వారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కెవిఎల్.ఎన్.రెడ్డి రాజు హాజరై మాట్లాడుతూ కొత్త అవతారం,హిందూ మతాన్ని చక్కగా తెలుపగల నైపుణ్యం, వికాసవంతమైన వ్యక్తిత్వం,ఈ మూడు గుణాలతో అతను అందరి హృదయాలను గెలవగలిగాడన్నారు.వాదనలలో ఆయనను గెలవగలిగిన వారు లేరన్నారు.ఆయన ఆంగ్ల నైపుణ్యం అపారం అని కొనియాడారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మార్క ఉపేందర్ గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి బండ శ్రీనివాస్,సద్ది సోమిరెడ్డి,మారబోయిన గట్టయ్య,కిష్టయ్య,కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

నర్మెట్ట మండల కేంద్రంలో …..

బీజేవైఎం మండల అధ్యక్షులు బొల్లం అవినాష్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకల కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రభారీ కె.వి.ఎల్.ఎన్ రెడ్డి,బిజెపి జిల్లా కార్యదర్శి ధరవాత్ రాజు నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రధాత,మార్గదర్శి,భారతదేశ ఔన్న త్యాన్ని ప్రపంచానికి చాటిన చైతన్య మూర్తి స్వామి వివేకానందుడు అన్నారు.వివేకానందుని ఆదర్శంగా తీసుకుని యువత ఆదర్శప్రాయులుగా నిలవాలన్నారు.ఆ వివేకానందుని మార్గంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన భారత దేశ గౌరవాన్ని పెంచి దేశంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక దేశంగా గుర్తించబడ్డామన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రంగు మురళి,మండల కన్వీనర్ సోక్కం అనిల్,కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి ఆంజనేయులు,మండల ఉపాధ్యక్షులు సిద్ధులు,సీనియర్ నాయకులు బండి శ్రీను,పోలు రాజు,బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు శేఖర్ బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి రంజిత్,బూత్ అధ్యక్షులు శివ,శ్రీనివాస్,మహేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.

 

ఏబీవిపి జనగామ ఆధ్వర్యంలో…….

 

 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జనగామ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు.తదనంతరం జిల్లా కన్వీనర్ తోట హృతిక్ మాట్లాడుతూ స్వామి వివేకానందున్ని నేటి యువత అంతా ఆదర్శంగా తీసుకోవాలని ఆయన బాటలో నడవాలని అన్నారు.స్వామి వివేకానంద ప్రపంచ దేశాలకు భారతదేశ ఖ్యాతిని విస్తరించిన మహానుభావుడన్నారు.ఆయన అడుగుజాడల్లో మన యువత నడిచి మన దేశాన్ని కులమత బేధాలతో విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాలని అన్నారు.వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా అందరం సమాజ సేవ చేయాలని అన్నారు.ఇలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని మనమంతా కూడా దేశ సంరక్షణ కోసం కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గుంటుపల్లి కార్తీక్,నితీష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేందర్,ఉమర్,సాయి,రాజు,దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular