యాహత్ షావలి దర్గాలో గంధం మహోత్సవం
గంధం అందుకునేందుకు ఎగబడ్డ భక్తులు

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్న పేట మండలంలోని బండనాగరం దర్గా పంచాయతీ పరిధిలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో ప్రధానమైన గంధోత్సవం ను గురువారం సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. బాబా ఇంటి నుంచి తీసుకొచ్చిన గంధాన్ని గ్రామంలోని దర్గా వద్ద ఉంచారు. అంతకంటే ముందు అత్యంత పవిత్రంగా మేళతాళాలతో బాబా ఇంటి నుండి దర్గా వరకు తీసుకొచ్చారు. దర్గా బాబా ఇంటి నుంచి తీసుకొచ్చిన గంధాన్ని ముస్లిం మతపెద్దలు, ముజావర్ల సమక్షంలో దర్గాలో ఉంచిన గంధంలో కలిపి పూజలు నిర్వహించారు. అనంతరం గంధాన్ని దర్గా ప్రధాన వీధుల్లో ఊరేగించారు. ఈ గంధాన్ని అందుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. గంధోత్సవంలో దేవనూరిలింగం,శ్రీకాంత్, శ్రీను, రాజేందర్, స్వామి, అన్వర్, యాకుబ్, థౌసేఫ్ మరియు గ్రామస్తులుతదితరులు పాల్గొన్నారు.

