Sunday, March 1, 2026

పేదవారి ఇంటికల కాంగ్రెస్ ప్రభుత్వంతో నెరవేరబోతుంది..

ప్రతి మండలంలో ‘ఇందిరమ్మ మోడల్ హౌజ్’ నిర్మాణం.

పేదవారి ఇంటికల కాంగ్రెస్ ప్రభుత్వంతో నెరవేరబోతుంది..

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

ప్రతి మండలంలో ఇందిరమ్మ మోడల్ హౌజ్ నిర్మాణం చేస్తున్నట్లు గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడం గొప్ప విషయమని బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా బచ్చన్నపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ.ప్రజాపాలనలో ఇండ్ల కోసం   దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తుదాడి ఇంటికి వెళ్లి అధికారులు సర్వే నిర్వహించారని అన్నారు . ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కండిషన్లు ఏమీ లేవని… పేదవారైనా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని, పేదవారి ఇంటి కల నెరవేర్చడమే సీఎం రేవంత్ రెడ్డి, జనగమ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి  లక్ష్యం అని అన్నారు. పదేళ్లు ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం ఎదురుచూసి ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేల కూల్చి ఆ నేలపై ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నారని తెలియజేశారు. గత పది ఏళ్ల నుండి రేషన్ కార్డులు రాక ప్రజలు ఇబ్బందులకు గురైన పట్టించుకునే నాధుడే లేడని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుంది ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు వస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, మాస పేట రవీందర్ రెడ్డి,దాచేపల్లి నర్సింగరావు, గణపురం నాగేష్ ,మట్టి బాలరాజు, నల్ల మహేందర్ , గిద్దల రమేష్, గుర్రపు బాలరాజు, వద్ది ఎల్లయ్య, అల్వాల ఎల్లయ్య, పర్వతం యాదగిరి,ఉపేందర్ రెడ్డి, బాబు, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular