Sunday, March 1, 2026

అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు…..

అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు…..

మన సాక్షి గొంతుక/బచ్చన్నపేట మండలం

రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ల విషయంలో ఎవరూ అపోహపడవద్దని బండ నగరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇప్ప  శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి  ఆదేశాల మేరకు మాట్లాడుతూ   బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారో బిఆర్ఎస్ నాయకులు లెక్క చెప్పాలన్నారు. జనవరి 26 నుండి నాలుగు పథకాలు (రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా) కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం అందిస్తుంది అన్నారు.ఇది నిరంతర ప్రక్రియ అర్హత ఉన్న వాళ్లకు రేషన్ కార్డులు,ప్రజాపాలన, గ్రామ సభల్లో పెట్టుకున్న దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని పరిమితి లేకుండా అర్హులకు రేషన్ కార్డులతో పాటు అన్ని రకాల పథకాలు ప్రజా ప్రభుత్వం ద్వారా ఇవ్వబోతున్నామని తెలియజేశారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular