గంగపురం గ్రామ అభివృద్ధి పై బిఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు ఖండిస్తున్నాం …

అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే..
బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అభివృద్ధి అంతా శూన్యం….
మనసాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో గంగపురం గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు మాట్లాడిన మాటలు అన్ని అవాస్తవాలని గంగపురం గ్రామ మాజీ సర్పంచ్ ,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల నరసింహులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గంగపురం సర్పంచ్ బిల్లులు రాక ఇబ్బందులకు గురవుతున్నారని మాట్లాడిన మాటలు ఖండిస్తున్నాను అని అన్నారు. గతంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గంగాపురం గ్రామాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. అప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప గత పది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఎలాంటి అభివృద్ధికి గ్రామం నోచుకోలేదని తెలియజేశారు. గతంలో ఎస్సీ కాలనీలో కమిటీ హాల్, గ్రామంలో సిసి రోడ్లు, 25 ఇందిరమ్మ ఇల్లు, కాలభైరవ టెంపుల్ వరకు కంకర రోడ్డు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 250 మీటర్ల వరకు సిసి రోడ్డు, ఇంకా 250 మీటర్ల వరకు సిసి రోడ్డు వెయ్యడానికి ప్రపోజల్ చేయడం జరిగిందని ,అలాగే గ్రామపంచాయతీ భవన్ ఏర్పాటు చేయడానికి జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో రానున్న రోజుల్లో నూతన గ్రామ పంచాయతీ భవనం కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలోనే నిర్మయించనున్నట్లు తెలియజేశారు. జనగామ ప్రాంత గ్రామాల అభివృద్ధి కొమ్మూరి ప్రతాపరెడ్డి తోనే సాధ్యమని తెలియజేశారు. గ్రామ అభివృద్ధిపై బహిరంగ సవాలుకు సిద్ధమని సవాల్ విసిరారు.

