పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డ్, ఇండ్లు ఇవ్వలేకపోయిన బిఆర్ఎస్ ప్రభుత్వం
ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు నిరంతర ప్రక్రియ…

వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ మాసాపేట రవీందర్ రెడ్డి
మన సాక్షి గొంతుక బచ్చన్న పేట మండలం
పేద ప్రజల కోసం ప్రభుత్వం మరో నాలుగు కొత్త పథకాలు ఈనెల 26న ప్రారంభించేందుకు సిద్ధమైందని వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ మాసపేట రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామానికి కూడా కొత్త రేషన్ కార్డులు ,ఇండ్లు ఇవ్వలేకపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుంటే బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక లేకపోతున్నారన్నారు.ఈనెల 21 నుండి 24 వరకు గ్రామ సభలు నిర్వహించారు.ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొని వారు గ్రామసభలో చేసుకునే అవకాశం కల్పించారు.ఒకవేళ గ్రామ సభలో దరఖాస్తు చేసుకోపోతే ఈ పథకాలకు నిరంతర ప్రక్రియ అని ఎంపీడీవో ఆఫీసులో ఎప్పటికీ దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.ఈనెల 26న 4 కొత్త పథకాలు అయినా రైతు భరోసా,పంట పెట్టుబడి సాయం,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,కొత్త రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్ల పథకాలను అమలు చేయనున్నారు.ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్దిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసింది.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు ఏడాది రూపాయలు 12 వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది.అలాగే ఇందిరా ఇల్లు పథకాన్ని కి లబ్దిదారులకు పలు విడతల్లో ఐదు లక్షలు ఇవ్వనుంది.అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులో సవరణ చేయనున్నారు.పథకాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు.ఎవరు అధైర్యపడవద్దు రానివారికి గ్రామసభలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన కొంతకాలానికి అర్హులైన సభ్యులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని అర్హులైన లబ్దిదారుల అందరికీ కొత్త రేషన్ కార్డు అందించడానికి ప్రభుత్వ కృషి చేస్తుందని అన్నారు.

