కొమ్మూరి ఆధ్వర్యంలో జిల్లా సందీప్ జన్మదిన వేడుకలు

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, సామాజికవేత్త జిల్లా సందీప్ జన్మదిన వేడుకలు జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేకులు కట్ చేపించి,శాలువలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత సామాజిక కార్యక్రమాలలో పాల్గొని ప్రజా సేవ చేస్తూ, రాజకీయాలలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్ల నాగుల శ్వేతా వెంకన్న, గంగం నరసింహ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, హరికృష్ణ, బోయిని కొండస్వామి, కర్రె నరేష్, అఖిల్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు

