ఎండుతున్న వరి పొలాలు పట్టించుకోని ప్రభుత్వం..
వెంటనే చెరువులు కుంటల నింపాలి…

సర్పంచుల పోరం మండలం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి
మన సాక్షి గొంతుక డెస్క్
ఎండుతున్న పొలాలకు సాగునీరు అందించాలని సర్పంచుల పోరం మండలం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలంలో ప్రకటన ద్వారా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో 10 సంవత్సరాలు ఒక్క ఎకరం వరి పొలం కూడా ఎండిన చరిత్ర లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లోనే భూగర్భ జలాలు అడుగంటి వరి పొలాలు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయని, నీళ్లు అందించక రైతుని ఆరి గోస పెడుతున్నారని అన్నారు.వరి పంట ఎండిపోతున్న, అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. రెండు మూడు రోజులలో చెరువులు,కుంటలకు నీరు అందించి, ఈ ప్రాంతంలోని ఉండే పంటలను కాపాడాలని విజ్జప్తి చేశారు. లేనిపక్షంలో ఇరిగేషన్ ఆఫీస్ వద్ద, చౌరస్తాల వద్ద ,రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు చేపడుతామని హెచ్చరించారు.

