బచ్చన్నపేట ధర్నాకు తరలి వెళ్దాం

చెరువులు కుంటలు నింపే వరకు పోరాటం చేద్దాం..
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట చౌరస్తా లో జరిగే మహాధర్నకు తరలి వెళ్దామని బిఆర్ఎస్ పార్టీ కొన్నె గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పరపు సిద్ధారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం రోజున బచ్చన్నపేట మండల కేంద్రంలో నీళ్ల కోసం జరుగుతున్న మహాధర్నా కార్యక్రమానికి కొన్నే గ్రామం నుండి రైతులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం లో ఒక్క ఎకరం కూడా ఎండకుండా నీళ్లను అందించినమని ,ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళని ఇవ్వలేక రైతులను అరిగోస పెడుతుందని అన్నారు. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరారు.

