Sunday, March 1, 2026

ధర్నా చేయాల్సింది చౌరస్తాలో కాదు… ఎమ్మెల్యే పల్లా ఇంటి దగ్గర ధర్నా చేయండి…

ధర్నా చేయాల్సింది చౌరస్తాలో కాదు…

ఎమ్మెల్యే పల్లా ఇంటి దగ్గర ధర్నా చేయండి…

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇజ్జగిరి రాములు. 

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇజ్జగిరి రాములు మాట్లాడుతూ ఈరోజు బిఆర్ఎస్ నాయకులు బచ్చన్నపేట చౌరస్తా వద్ద నీళ్ల కోసం చేసిన ధర్నాను ఖండిస్తూ ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.. కొందరు బిఆర్ఎస్ నాయకులు స్టేషన్గన్పూర్, ఆలేరుకు నీళ్లు తరలి వెళ్తున్న జనగామ నియోజకవర్గనికి నీటి చుక్క రావడం లేదని దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని మాట్లాడిన వాక్యాలను ఖండిస్తున్నాను అని. ఎందుకంటే జనగామ నియోజకవర్గనికి నీళ్లు తీసుకురాలేక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పూర్తిగా వైపల్యం చెందాడని, జనగామ నియోజకవర్గ రైతులను గాలికి వదిలేసి, ప్రొద్దున లేస్తే కేసీఆర్ ఫామ్ హౌస్, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం చుట్టూ తిరగడం తప్ప జనగామ ప్రజలను పట్టించుకునే ఉద్దేశంలో లేడని అన్నారు. ఎమ్మెల్యే కు నియోజకవర్గంలో ఎప్పుడు ప్రోటోకాల్ లొల్లి తప్ప ప్రజల సమస్యను పట్టించుకునే ఉద్దేశం లేదన్నారు.ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్న చెరువులు కుంటలు నింపాలని సంబంధిత మంత్రులతో మాట్లాడుకొని డ్యాములు చెరువులు ,కుంటలు నీటితో నింపుతుంటే పల్ల రాజేశ్వర్ రెడ్డి మాత్రం కెసిఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తన నియోజకవర్గనికి నీళ్లు తెస్తుంటే జనగామ ప్రజలకు నీళ్లు తేలేకపోయినా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ,ప్రజల మీద ఎప్పుడు కక్ష పూరితరాజకీయం ఉండదని అన్నారు. ఆనాడు రైతును రాజును చేసింది, ఈ డ్యాములు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గుర్తించుకోవాలన్నారు.కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఓడిన ప్రజల నాయకుడని ,ప్రజల మధ్యన ఉండే ఏకైక నాయకుడు అన్నారు. ఇప్పటి కే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి రెండు మూడు రోజులలో జనగామ నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు వెంటనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి ధర్నా చేయండి అని హెచ్చరించారు..

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular