ట్రైన్ కింద పడి యువకుడి మృతి

మన సాక్షి గొంతుక న్యూస్/జనగామ టౌన్:
హిందూ వాహిని జనగామ పట్టణ అధ్యక్షుడు రాకేష్ శనివారం మధ్యాహ్నం ట్రైన్ కింద పడి మృతి చెందాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బీరప్ప గడ్డ ప్రాంతానికి చెందిన రాకేష్ ఆలేరు – పెంబర్తి రైల్వే మార్గంలో గుర్తు తెలియని ట్రైన్ కింద పడి మరణించినట్లు తెలిపారు.నిన్నటి వరకు చురుకుగా పని చేసిన రాకేష్ నేడు విగతజీవిగా మారడంతో స్థానికులు,మిత్రులు కన్నీటి పర్యంతం అయ్యారు.రాకేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని డెడ్ బాడీని భువనగిరి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

