మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్…..

మన సాక్షి గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మురి ప్రతాప్ రెడ్డి ఆదేశఅనుసారం నిరుపేద కుటుంబాలకు చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ సందర్భంగా బచ్చన్నపేట మండల కేంద్రంలో కొద్దిరోజుల క్రితం నీటి సంపులో పడి మరణించిన నిరుపేద కుటుంబానికి చెందిన బాల చారి కుటుంబానికి చేర్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నల్లనాగుల శ్వేతా వెంకన్న 5,000 రూపాయలు ఆర్థిక సహాయంగా ఈ సందర్భంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని మనోధైర్యాన్ని నింపారు. రానున్న రోజుల్లో మండలంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట టౌన్ అధ్యక్షులు కోడూరి మహాత్మాచారి, ప్రధాన కార్యదర్శి కర్రె నరేష్, నాయకులు జంపయ్యా,దాచేపల్లి రాజయ్య, గుర్రం బాలరాజు, గంధ మల్ల కిష్టయ్య,భాస్కర్,రవి,చింతల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

