కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మార్పు — మార్పు అంటేనే కాంగ్రెస్ పార్టీ
ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా సంబరాలు జరుపుకుంటున్న సమయం ఇది…

మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
బీసీ ,ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా సంబరాలు జరుపుకుంటున్న సమయం ఇతని కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే అన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈరోజు బీసీ ,ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమలు చేయనున్నదని తెలియజేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి నాయకత్వంలో జనగమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలియజేశారు

