Sunday, March 1, 2026

సి.యం రేవంత్ రెడ్డి నిర్ణయం చరిత్రాత్మకం…

సి.యం రేవంత్ రెడ్డి నిర్ణయం చరిత్రాత్మకం…

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్

మన సాక్షి గొంతుక డెస్క్

బీ.సీ రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలోనే కాదు పార్లమెంట్ లో కూడ ఆమోదం అయ్యే వరకు విశ్రమించేది లేదని తేల్చి చెప్పి మరోసారి తన పోరాటపటిమని చాటిన తెలంగాణ సియం రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువత జీవితాల్లో వరస నోటిఫికేషన్లు పారదర్శకమైన ఫలితాల వెలువడితో బంగారు పంట పండిస్తున్న నేటి కాంగ్రెస్ ప్రభుత్వం.

సోమవారం అసెంబ్లీ లో బీ.సీలకు స్థానిక, విద్య ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లకు సంబందించిన బిల్లులకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదానికి కృషి చేసిన సి.యం రేవంత్ రెడ్డి, ఆమోదించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి మరియు రాష్ట్ర మంత్రి వర్గానికి,అభివృద్ధి ప్రదాత జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి కి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పాలన అంటేనే ఇది ప్రజాపాలనని నిరూపించుకుందని అన్నారు. చెప్పిన విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవారికి చేరే విధంగా కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. పేదవాడి ఇంటి కలను ఇందిరమ్మ ఇండ్లతో నెరవేర్చబోతుందని తెలియజేశారు. ఇంకా రానున్న రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి, పేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది అని తెలియజేశారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular