కాంగ్రెస్ కార్యకర్త మృతి….

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకులు.
మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం.
జనగామజిల్లా,బచ్చన్నపేటమండలంలోని, బండనాగారం గ్రామంలో మాజీ కారోబార్,రజక సంఘం అధ్యక్షుడు కాంగ్రెస్ కార్యకర్త అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మరణించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి, కాంగ్రెస్ నాయకులు ఇతని కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియలకు ఆర్థిక సహాయం 20000/- (కొల్ల నర్సిరెడ్డి 5000/-,ఇజ్జగిరి రాములు 5000/-,చల్ల సురేందర్ రెడ్డి 5000/-,కొప్పురపు జయ ప్రకాష్ రెడ్డి (విప్లవ్) 5000/-) రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చల్ల రమేష్ రెడ్డి, బత్తిని రాజలింగం,ఇజ్జగిరి కరుణాకర్,పరుశురాములు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

