ప్రజా ప్రభుత్వమంటే ఇదే మరి…
ప్రతి ఇంటికి సన్న బియ్యం…
ఇది కదా.. మార్పు అంటే….

బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నూకల బాల్రెడ్డి
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కడుపు నింపడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం బచ్చన్నపేట మండలం బండ నాగారం గ్రామంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశానుసారం బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల బాల్రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎద్దు హరీష్ పాల్గొని అనంతరం మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అది మంచి నిర్ణయమని ప్రజల నుండి మంచి ఆదరణ ఉందని అన్నారు ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు రాజేష్ ఖన్నా, లక్ష్మాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రవీణ్, మండల యువ నాయకులు జిల్లా సందీప్,ఇజ్జగిరి రాములు, సురేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సబాదు నరసమ్మ, రమేష్ రెడ్డి, బాబు, సుధాకర్ రెడ్డి, సురేష్, రేషన్ డీలర్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

