వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
–ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం అందించాలి

—వ్యవసాయ శాఖ మంత్రికి ఎమ్మెల్యే డా.పల్లా విజ్ఞప్తి
–-సిద్దెంకి,ఎల్లంల,పెంబర్తి గ్రామాల్లో దెబ్బతిన్న పంటల పరిశీలన
మన సాక్షి గొంతుక న్యూస్/జనగామ రూరల్:
వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోని,పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు ఆర్థిక సహాయం అందించాలని జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా సోమవారం జనగామ మండలంలోని సిద్దెంకి,ఎల్లంల,పెంబర్తి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన ఆకాల వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను వ్యవసాయశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.స్థానిక జిల్లా కలెక్టర్,వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.పల్లా మాట్లాడుతూ వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకోని,ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం అందించాలన్నారు.వానల వల్ల దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేయాలన్నారు.మామిడి,బత్తాయి, సపోటా తదితర పంటలు గాలి దుమారానికి పూర్తిగా ధ్వంసమయ్యాయ్యాయని,వెంటనే వీటిని కూడా సర్వే జరిపి నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

