మల్లన్న గుడి నిర్మాణానికి 50,000 విరాళం…..

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
సామాజికవేత్త , కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు జంగిటివిద్యనాథ్ పలు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తూ , దైవభక్తితో గుడి నిర్మాణాలకు విరాళలు అందిస్తున్నారు. జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం,పడమటి కేశవాపూర్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మల్లన్న గుడికి 50 వేల రూపాయల విరాళం గా అందించారు. ఈ సందర్భంగా దైవభక్తి చాటుకున్న జంగిటి విద్యనాథ్ కు ఆ గుడి కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు ఎర్రోళ్ల సోములు యాదవ్ , చల్ల సంతోష్ రెడ్డి, నిమ్మ కరుణాకర్ రెడ్డి , శేరి నర్సయ్య ,నరసింహ యాదవ్, ఎర్రోళ్ల శివ యాదవ్. తుప్పుడు రాములు యాదవ్,తుప్పుడు బాలయ్య యాదవ్,సింగరి రాజయ్య యాదవ్,ముదొల్ల బాలమల్లు యాదవ్. రాజు యాదవ్. యాదవ సంఘం నాయకులు కులస్తులు పాల్గొన్నారు.

