ఐకెపి సెంటర్లో పడ్డ పిడుగు..


12 మందికి గాయాలు అందులో ,ఇద్దరికీ తీవ్ర గాయాలు…
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలం ,ఆలింపురం గ్రామంలో ఐకెపి సెంటర్లో పిడుగుపాటుకు 12 మందికి గాయాలు అయ్యాయి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా గాలి దుమారం , రావడంతో రైతులందరూ వడ్ల పైన వరదలు కప్పి ఐకెపి సెంటర్ లో అందరూ నిలబడడంతో ఒక్కసారిగా పిడుగు పడింది. అందరికీ గాయలవడంతో వెంటనే 108 వాహనాల్లో జనగామ ఏరియా ఆసుపత్రికి రైతులను తరలించారు. విషయం తెలిసిన వెంటనే బచ్చన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి జనగామ ఏరియా ఆసుపత్రికి హుటాహుటిగా వెళ్లి రైతులను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి మెరుగైన చికిత్స , వారికి సహాయం అందే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, మండల నాయకులు జిల్లా సందీప్, హరికృష్ణ, కర్రే నరేష్ తదితరులు ఉన్నారు.

