పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన పౌరులకు ఘన నివాళి

–ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి
— బీసీ సంక్షేమ సంఘం జనగామ పట్టణ అధ్యక్షులు జాయ మల్లేష్ కురుమ
మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ:
ప్రశాంత వాతావరణంతో,నిండు పర్యావరణంతో ఆహ్లాదాన్ని పంచే కాశ్మీర్ లోయలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటక దేశ పౌరులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా తుపాకులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని,ఉగ్ర దాడిలో మృతి చెందిన దేశ పౌరులకు ఘన నివాళులు అర్పిస్తున్నానని,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని బీసీ సంక్షేమ సంఘం జనగామ పట్టణ అధ్యక్షులు జాయ మల్లేష్ కురుమ* అన్నారు.ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ భారతీయులను తీవ్రంగా కలిచి వేసిందన్నారు.ఉగ్రదాడిలో 27 మంది సామాన్య పౌరులు చనిపోవడం అత్యంత బాధాకరమైన,విషాదకరమైన సంఘటన అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.నిత్యం శాంతితో,ప్రశాంత వాతావరణo ఉన్న దేశంలో ఉగ్రవాదులు అశాంతిని నెలకొల్పేందుకు కుట్రలు చేయడం మంచి పరిణామం కాదని,అశాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తే దేశ పౌరులు ఊరుకునే స్థితిలో లేరని హెచ్చరించారు.దేశంలోని సమస్యాత్మక ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

