రజతోత్సవ సభ విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు….

బచ్చన్నపేట మండల బిఆర్ఎస్ కోఆర్డినేటర్ ఎండి ఫిరోజ్
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
వరంగల్ ఎల్కతుర్తిలో జరిగిన భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు బి ఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఎండి ఫిరోజ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వరంలో ఏర్పాటుచేసిన రజతోత్సవ సభ కు తరలివచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, విజయవంతం చేయడానికి కృషిచేసిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు ,మాజీ ప్రజా ప్రతినిధులు, మండల గ్రామ శాఖ అధ్యక్షులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో ఇదే జోరుతో బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీ ఎదుర్కొని, బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

