Sunday, March 1, 2026

ప్రవీణ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటా

ప్రవీణ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటా

ఆయన సేవలు ఎప్పటికీ గుర్తు ఉంటాయి

ఆర్థిక సహాయాన్ని డిపాజిట్ చెక్కు రూపంలో అందచేత

దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా. పల్లా

మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ:

బిఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటా..ఆయన ఆకస్మిక మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచలో జరిగిన పానుగంటి ప్రవీణ్ గారి దశదిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా ప్రవీణ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.కాగా పార్టీ కార్యకర్తలు,స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై ప్రవీణ్ కు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా.పల్లా మాట్లాడుతూ ప్రవీణ్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు.అతడు పార్టీ బలోపేతానికి కృషి చేశాడు.అలాంటి నాయకుడు మరణించడం పార్టీకి తీరని లోటు..ప్రవీణ్ కుటుంబానికి ఎల్లప్పుడూ బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.ఈ సందర్బంగా ప్రవీణ్ కుటుంబానికి ఎమ్మెల్యే పల్లా రూ. 2లక్షలు,పట్టణ అధ్యక్షులు తాళ్ల సురేష్ రెడ్డి రూ.1లక్ష, పలువురు నాయకులు చేసిన ఆర్థిక సహాయాన్ని డిపాజిట్ చెక్కు రూపంలో అందజేశారు.ప్రవీణ్ సేవలు ఎప్పటికీ గుర్తు ఉంటాయి.ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఎమ్మెల్యే పల్లా ఆకాంక్షించారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular