జనగామ చౌరస్తా లో బహిరంగ చర్చకు సిద్ధం…
చేసేది సామాజిక సేవయితే డబ్బులు అడుగుతున్నారని పోలీస్స్టేషన్లో పిటిషన్లు…
నేడు అదే వ్యక్తి మమ్మల్ని ఎవరు డబ్బులు అడగలేదు అని వీడియో రిలీజ్….
బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి వివరణ….
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
అసలు బాధితుడే కానీ వ్యక్తితో అక్రమ పిటిషన్ ఇప్పించి, నన్నే కాదు,మొత్తం కాంగ్రెస్ పార్టీనే బదునాము చేసే కుట్రలు సొంత పార్టీ నాయకులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి విషయంలో బచ్చన్నపేట మండలములోని,కొన్నే గ్రామానికి చెందిన బాధితులు కరోళ్ల జ్యోతి w/o సంపత్ కు రావాల్సిన చెక్కును,ఇవ్వాలంటే 25 వేల రూపాయలు పట్టుకొని రండి అని, నేను కరోళ్ల సాగర్ అనే వ్యక్తికి ఫోన్ చేసి,మండల పార్టీ అధ్యక్షులు అయ్యిన నూకల బాల్ రెడ్డి చెప్పాడనేఅభియోగంతో,నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్,నూకల బాలిరెడ్డి గారలమైన మా పైన జనగామ ఎస్ హెచ్ ఓ, సిఐ గారైన దామోదర్ రెడ్డి గారికి కలిసి,చెక్కులకు సంబంధం లేని వ్యక్తి అయ్యిన సాగర్ తో బలవంతంగా అక్రమ పిటిషన్ ఇప్పించడం జరిగింది.గతంలో చాలా రోజుల నుంచి, సామాజిక సేవ లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రాజలింగం కుమారుడు నాగపూరి కిరణ్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో, మరియు ఎల్ వో సి రూపంలో లక్షలాది రూపాయల విలువ చేసే చెక్కులను,వందలాది మంది లబ్ధిదారులకి,అదికూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ఇవ్వడం,అందించడం జరిగింది
ఇప్పుడు కిరణ్ ద్వారా మండలానికి చెందిన 2,3 గ్రామాలకు చెక్కులు ఇప్పించే పనిలో,ఒక మండల పార్టీ అధ్యక్షుడి హోదాలో నేను, కిరణ్ దగ్గరికి వెళ్లి ఇప్పించే క్రమంలో ఏ మాత్రం చెక్కులకు సంబంధం లేని వ్యక్తి అయిన కరోళ్ల సాగర్ ను తెరమీదికి తెచ్చి,అతనితో అక్రమ పిటిషన్ ఇప్పించి, కేవలం బాలిరెడ్డి,కిరణ్ మీద మాత్రమే కాదు,కాంగ్రెస్ పార్టీనే బ్రష్టు పట్టించాలని ప్రయత్నం చేస్తూ,పతకం ప్రకారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు.నేను చెక్కుల కొరకు డబ్బులు డిమాండ్ చేసినట్లు జనగామ చౌరస్తా లో బహిరంగ చర్చచేసి, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రుజువు చేయాలని,అదికూడా బలవంతపు పిటిషన్ ఇప్పించిన ప్రతి నాయకుడు చొరవ చూపించాలని డిమాండ్ చేస్తున్న అని అన్నారు.
ఏ వ్యక్తి అయితే పిటిషన్ ఇచ్చిండో,అతనే స్వతహాగా ఒక వీడియో చేసి నూకల బాల్ రెడ్డి నైనా నాకే పంపించి, మా బాబాయ్ కు చెక్కు వస్తుంది అంటే డిసిసి ఆఫీస్ కు వెళ్లాను, అక్కడ వారే నా సంబంధం లేని విషయంలో పిటిషన్ ఇప్పించారు, నాకేం సంబంధం లేదు,అని వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా నిజ నిజాలు ,నాయకులు ,కార్యకర్తలు తీసుకోవాలని అన్నారు.

