Sunday, March 1, 2026

జనవాసంలో ప్రమాదకరంగా 11 కెవి కరెంటు లైన్ 

జనవాసంలో ప్రమాదకరంగా 11 కెవి కరెంటు లైన్ 

పలుమార్లు విద్యుత్తు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్న కనికరించిన వైనం

విద్యుత్ ప్రమాదంలో ఒకరు మృతి

 

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, గోపాల్ నగర్ గ్రామంలో11 కెవి విద్యుత్ ప్రమాదంలో ముషీరాబాద్ కు చెందిన ఎండి అసత్ మృతి చెందాడు. ఇంటి పైన ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయా లేవా అని చూడడానికి వెళ్లి విద్యుత్ కరెంటు వైర్లు తాకి అతను అక్కడికక్కడే చనిపోయాడు. 11 కెవి విద్యుత్తు లైను ప్రమాదకరంగా ఉందని గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజా పాలన లో గోపాల్ నగర్ గ్రామ నిరుపేద ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాధుడు లేకపోయాడు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నేడు ప్రజా పాలన కూడా దరఖాస్తు చేసుకోగా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు .ఈ విద్యుత్తు లైను తొలగించాలి అంటే మూడు లక్షల 22 వేల రూపాయలు డబ్బులు ఖర్చులు  అవుతుందని ఇష్టమేంట్ స్టేట్మెంట్ విద్యుత్ అధికారులు ఇచ్చారు. అంత అమౌంట్ను అంత డబ్బులను ఇచ్చుకునే పరిస్థితిలో ఇక్కడి కాలనీవాసులు లేరు .అంత డబ్బు కట్టలేక కరెంటుతో భయపడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఇట్టి ప్రమాదకరమైన విద్యుత్తు లైను ఇక్కడి నుంచి తొలగించి ,ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు కోరారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular