Sunday, March 1, 2026

ఆదివారం రోజున మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం 

ఆదివారం రోజున మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం 

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట మండల కేంద్రంలో బచ్చన్నపేట చౌరస్తా వద్ద బంగ్లా లో లయన్స్ క్లబ్ ఆఫ్ బచ్చన్నపేట వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య పరీక్ష శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు మండల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం రోజున ఏర్పాటు చేసే ఉచిత వైద్య శిబిరాన్ని బచ్చన్నపేట మండలంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో న్యూరో,జనరల్, స్కిన్ ,యూరాలజిస్ట్ , నేత్ర వైద్యులు,గైనకాలజిస్ట్ , షుగర్, బిపి పిల్లలకు సంబంధించిన వైద్య బృందం ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా వారికి మందులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా లయన్ లవ కుమార్ రెడ్డి ,కన్నా పరశురాములు, చందుపట్ల రవీందర్ రెడ్డి ,జయ హరి ,ప్రవీణ్ కుమార్, ఈదులకంటి ప్రతాప్ రెడ్డి, చర్ల శ్రీనివాస్ రెడ్డి, బోడకుంటి మల్లయ్య, మూసిని రాజు, గోపాల్ రెడ్డి లు పాల్గొంటారని తెలియజేశారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular