రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి

స్టేషన్ ఘన్‌పూర్, మే 31, (మనసాక్షి గొంతుక) :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆర్డీఓ డిఎస్ వెంకన్న అన్నారు. శనివారం డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆర్డీఓ వెంకన్న మాట్లాడుతూ జూన్ 02న డివిజన్ కేంద్ర జంట పట్టణం శివునిపల్లిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈకార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొంటున్నారని తెలిపారు. ఈవేడుకల్లో మున్సిపల్ పరిధిలోని 222 మంది, గ్రామీణ ప్రాంతంలో 305 ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ అందజేస్తారని అన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు 7 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కులు, 39 మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తారని తెలిపారు. ఈకార్యక్రమానికి అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, యువకులు, కవులు, కళాకారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్డీఓ కోరారు.

