నాన్యమైన విద్యుత్ అందించడమే నాలక్ష్యం
— డిఈఈ రాంబాబు

స్టేషన్ ఘన్‌పూర్, మే 31, (మనసాక్షి గొంతుక) :
వినియోగదారులకు నాన్యమైన విద్యుత్ అందించడమే నాలక్ష్యమని డిఈఈ రాంబాబు అన్నారు. 33 కెవి విద్యుత్ లైన్ ఇంటికి దగ్గరగా ఉండి వర్షం పడిన సమయంలో పిడుగు పడి ఇంట్లోనే విలువైన వస్తువులు కాలిపోతున్నాయని బాధితులు చేసిన విజ్ఞప్తికి రాంబాబు స్పందించారు. స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని పాత సినిమా టాకీస్ వద్ద హైటెన్షన్ విద్యుత్ లైన్ ను డిఈఈ పరిశీలించారు. ఇప్పటివరకు మూడుసార్లు పిడుగు పడి విద్యుత్ ఎలక్ట్రానిక్ పరికరాలు లైన్ వల్ల కాలిపోయాయని, మేము ఇల్లు కట్టిన తర్వాత లైన్ పోల్ ను మార్చి టవర్ వేయడం వల్ల లయన్ తీగలు ఇంటికి దగ్గర వచ్చాయని బాధితులు కృష్ణకుమారి తెలిపారు. లైన్లు పరిశీలించిన డిఇ లైన్ తీగలను ఇంటికి దూరంగా మార్చడానికి చర్యలు తీసుకొని సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎఈఈ శంకర్, లక్ష్మీనారాయణ, వాసం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

