డబ్బు వృధా కాకూడదు ప్రజాసేవకు ఉపయోగపడాలే…

సేవ దృక్పథం చాటుకున్న లయన్స్ క్లబ్…..
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
ఈ కాలంలో వివాహాలు, జన్మదినోత్సవాలకు లక్షల డబ్బులు ఖర్చు చేస్తున్నారు కానీ, బచ్చన్నపేట మండలానికి చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు ప్రజల ఆరోగ్యానికి ఖర్చు పెట్టాలని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బచ్చన్నపేట వారి ఆధ్వర్యం లో మే మాసం లో జన్మదినోత్సవాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ఈదులకంటి ప్రతాప్ రెడ్డి ,చల్లా శ్రీనివాస్ రెడ్డి, రామిని మదన మోహన్, మూసిని రాజు మల్లవరం వెంకటేశ్వర రెడ్డి కొయ్యాడ శ్రీనివాస్ మరియు మేకల రంగా రెడ్డి గార్ల ఆర్థిక సహాయం తో ఉచిత వైద్య శిబిరం ఆదివారం ఉదయం 9:00 గంటలనుండి బచ్చన్నపేట ఇన్స్పెక్షన్ బంగ్లా ఆవరణలో ఏర్పాటు చేయగా సుమారు 500 మంది వివిధ ఆరోగ్య సమస్యలు నరాలు, చర్మం, నేత్రాలు, పిల్లలు, డెంటల్, ఆర్థోపెడిక్స్, స్త్రీల సంబందించిన సమస్యలు, కిడ్నీ, మూత్ర పిండాలకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పండ్లు పంపిణీ చేశారు ఇందులో డాక్టర్లు రంజిత్ కుమార్, విజ్ఞశ్రీ, నిశాంత్, ప్రీతి దయాళ్, సృజన్ కుమార్, శివ, కనక రాజు, సంతోషిణి, స్వప్న మూర్తి, లింగమూర్తి, నవీన్, సతీష్ సేవలు అందించగా లయన్స్ కార్యవర్గ సభ్యులు గంగం సతీష్ రెడ్డి, ముసిని రాజు,బద్దిపడగ గోపాల్ రెడ్డి, ఈదులకంటి ప్రతాప్ రెడ్డి, చల్లా శ్రీనివాస్ రెడ్డి రామిని శ్రీధర్, మట్టి శ్రీనివాస్, ఫిరోజ్, జిల్లా రాజేశ్వర్, జిల్లా రాజు, వెల్దుర్తి శ్రీనివాస్ మరియు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

