ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా వెలుగులు….
పేద ప్రజల్లో గుండెల్లో ఆనందం నిండిన వేళ…
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల ను జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి సారథ్యంలో బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాష్ట్ర యువ నాయకుడు కొమ్మురి ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం. ఇక్కడ ప్రతి పేదవారీకి న్యాయం జరుగుతోంది. ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఈ పట్టాలు వారిచూస్తున్న పెదలకు ఈ పట్టాలు వారి కలలను సాకారం చేస్తున్నాయి. తలదాచుకునే చోటు కలిగిన ప్రతి కుటుంబం సమాజంలో గౌరవంతో బతికే అవకాశం పొందుతుంది, అని పేర్కొన్నారు.అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆశ్రయమైన ఇంటిని కల్పించడంలో ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం పట్టా కాదు, పేదల భవిష్యత్తుకి బలమైన పునాది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తలదాచుకునే ఇంటి కోసం ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఇల్లు అందిస్తోంది అని వివరించారు.. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా సందీప్, ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య, మండల యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్, బాలకిషన్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు కూరాకుల రవి,కర్రె నరేష్, కొండా హరికృష్ణ, నీల రమేష్, జంగిటి సిద్ధులు, మోహన్,అఖిల్ మాల తదితరులు పాల్గొన్నారు.