నూతన కామన్ స్వాగత తోరణం ఏర్పాటుకు భూమి పూజ
విరాళంగా 10,50,000 అందజేత…
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం నుండి సిద్దిపేట రోడ్డుకు కొడవటూర్ సిద్దులగుట్ట దేవస్థానానికి వెళ్లే మార్గంలో పాత కమాన్ తొలగించి, నూతన కమాన్ స్వాగత తోరణం ఏర్పాటు చేయుటకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొబ్బరికాయలు, కొట్టి పూజలు చేశారు.దాత వల్లాద్రి చందన రమణారెడ్డి అజిత్ రెడ్డి అనురాగ్ రెడ్డి 10,50,000 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతలు దేవస్థాన అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. త్వరణం ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సిహెచ్ వంశీ , చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, ధర్మకర్తలు నిమ్మ కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,రామకృష్ణ ,భాస్కర్, రాములు, రాజయ్య, కొడవటూరు మాజీ సర్పంచ్ గంగం సతీష్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అల్వాల ఎల్లయ్య, జంగిటి విద్యనాథ్, జిల్లా సందీప్, కూచన సుప్రీమ్ ,గంగరబోయిన మహేందర్, మిలాపురం కనకయ్య ప్రధాన పూజారి ఓం నమశ్శివాయ మరియు సిబ్బంది పాల్గొన్నారు.